VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*తల్లిదండ్రులను పట్టించుకోకుంటే... 'రూ.10 వేల కోత'కు రంగం సిద్ధం*

చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి నిర్దేశిత మొత్తాన్ని తగ్గించి... వారి ఖాతాల్లో జమచేయాలన్న చట్టం అమలుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ప్రతినెలా ఉద్యోగి మొత్తం వేతనంలో 15% లేదా రూ. 10 వేలు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026'ను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా దీని అమలుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ నిబంధనలు రూపొందించి... ఆమోదానికి ప్రభుత్వానికి పంపించింది. కొత్త చట్టం కింద ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
*14న వర్కింగ్ డే.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన*

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహాపర్వదినం సందర్భంగా అక్టోబర్ 19న సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా ఈ నెల 14న రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అంగీకారంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
📢 AP NFBS Scheme: కుటుంబ పెద్ద మరణిస్తే ₹20,000 సాయం!

అర్హులైన పేద కుటుంబాలకు ఒకేసారి ₹20,000 ఆర్థిక సహాయం అందుతుంది.

✅ అర్హతలు:
• మరణించిన వ్యక్తి వయస్సు 18–60 ఏళ్లు.
• గ్రామీణ ఆదాయం ₹10,000 లోపు.
• పట్టణ ఆదాయం ₹12,000 లోపు.
• BPL కుటుంబం, విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు.

📄 పత్రాలు: డెత్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, NPCI లింక్ బ్యాంక్ పాస్‌బుక్.

📝 దరఖాస్తు: RDO కార్యాలయంలో మాన్యువల్‌గా సమర్పించాలి.

⚠️ ముఖ్య గడువు: మరణించిన తేదీ నుంచి 6 నెలల్లోపు అప్లై చేయాలి.
🔴 స్టేకు నిరాకరించిన ధర్మాసనం!

📌 68,420 మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ!

⚖️ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా.

📢 తుది కీ విడుదల, ఫలితాల ప్రకటనపై ఇంకా వీడని సందిగ్ధత!

⏳ వేలాది మంది అభ్యర్థుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి...
🔴 ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. రేపే తొలి విడత నోటిఫికేషన్!

🗳️ నవంబర్ 26న తొలి విడత పోలింగ్

🗳️ నవంబర్ 29న రెండో విడత పోలింగ్

🗳️ డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికలు

📊 డిసెంబర్ 2న ఓట్ల లెక్కింపు

📢 మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. రేపు వెలువడనున్న తొలి విడత నోటిఫికేషన్!
🔴 ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు!

🗳️ నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC).

📍 ఎన్నికలు జరగనున్న నాలుగు కార్పొరేషన్లు:

1. శ్రీకాకుళం
2. కాకినాడ
3. రాజమహేంద్రవరం
4. మంగళగిరి

🏙️ మరో 19 పురపాలక సంఘాల్లోనూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.

📢 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది!
🅰️🅿️ AP SSC – ముఖ్యమైన సమాచారం

📢 ఈ విద్యా సంవత్సరంలో AP SSC School Codes మారాయి.

పాత SSC School Code ఉపయోగించి, కింది లింక్ ద్వారా కొత్త School Code ను సులభంగా తెలుసుకోవచ్చు.

🔗 https://bse.ap.gov.in/sscadmntxts/Account/CheckNewSchoolCode.aspx

🔐 New Login వివరాలు:

- User ID: New School Code
- Password: New School Code+@

⚠️ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది గమనించగలరు. కొత్త School Code ఆధారంగా Login వివరాలను ఉపయోగించండి.