VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి సచివాలయంలో పరిధిలోని ఇద్దరు వాలంటీర్ల *ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో* విధుల నుంచి తొలగించిన ఎంపీడీఓ సురేష్ బాబు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో *ఇద్దరు వాలంటీర్స్ ను తొలగించిన ఎన్నికల అధికారి.* వాలంటీర్స్ ఏ పార్టీ తరఫునా కూడా ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.
కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన *ఏడుగురు వాలంటీర్లు* మరియు కర్నూలుకు చెందిన *ఇద్దరు వాలంటీర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వలన* ఎన్నికల అధికారి సంబంధిత వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
*నిధి పోర్టల్ నందు శాలరీ బిల్ ప్రేపరషన్ కొరకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది.ముందుగ గ్రామా / వార్డు వాలంటీర్ల బిల్ పెట్టుకున్నాక, సచివాలయ ఉద్యోగుల హాజరు అప్డేట్ చేసాక ఉద్యోగుల బిల్లులు ప్రోసెస్ చేసుకోవచ్చు. బిల్ నెంబర్ మాత్రం 2024 సిరీస్ తో మొదలు అవ్వాలి.*
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉల్లంఘనపై ఫిర్యాదులు అందితే తగిన చర్యలు చేపడతామంది.
💥 *Salary bill will be enabled on 25th of this month*
*చివరి 10 రోజులు మాత్రమే*

ఆస్తి మరియు ఖాళీ స్థలం పన్నులపై ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ మాఫి మరో 10 రోజుల్లో ముగుస్తుంది. కావున మీ యొక్క పన్నులను వెంటనే చెల్లించి మీ ధనాన్ని ఆధాచేసుకోండి.

*Note* : చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు ఉంటాయి కావున ముందుగానే మీ పన్నులు చెల్లించుకోండి.
☛ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాము.
☛ వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ≈ *CEO ముకేశ్ కుమార్ మీనా*
*గ్రామ వాలంటీర్లు - మండల ప్రజా పరిషత్, మైలవరం - మైలవరం మండలంలోని దొమ్మరసంధ్యాల గ్రామంలో శ్రీయుత జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్వహించిన ప్రదార కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వారిని - విధుల నుండి తొలగించుచు ఉత్తర్వులు - జారీ చేయుట - గురించి*
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్య క్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వాలంటీర్లను వెంటనే తొలగిస్తాము. వారిపై కేసులు నమోదు చేస్తాము. సంబంధిత చర్యలపై ఎంపీడీవోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ. వాలంటీర్ల ద్వారా వివిధ పథకాల పంపిణీ కార్యక్రమాలు నిలిపివేశాము. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల నగదు పంపిణీపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి-విజిల్ యాప్ తో పాటు 1950 కాల్ సెంటర్కు ఫిర్యాదులు చేయవచ్చు. ≈ *కలెక్టర్ నాగలక్ష్మి*
*వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా... వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి.* సీజే నేతృత్వంలోని *హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు*. వలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని వెల్లడి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఈసీకి ఆదేశం
APGLI upto Jan has been credited and updated in NIDHI portal. Policy Statement has not updated check monthly wise amount
*మండల ప్రజా పరిషత్, మచిలీపట్నం - వాలంటీర్లు - చిన్నాపురం గ్రామ పంచాయత్ పరిధి లో పని చేయుచున్న కొంతమంది వాలంటీర్లు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీల ప్రచారములో పాల్గొనుట - విధుల నుండి తొలగించుచూ - ఉత్తర్వులు జారీ చేయుట మైనది.*
పొదిలి పట్టణంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న జిలాని, ముజ్నువలి, వెంకటేశ్రు ఎన్నికల నియమావళిని అతిక్రమించి ప్రచారంలో పాల్గొనడంతో వారిని తొలగించినట్లు ఎంపీడీవో గౌసియా బేగం తెలిపారు. తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన వాలంటీర్ వెంకటేశ్వరరెడ్డిని కూడా తొలగించారు.
సోషల్ మీడియా లో ఫార్వర్డ్ అవుతున్న ఈ పైన న్యూస్ 👆 *ఫేక్ న్యూస్ అని APCEO ట్వీట్* 👆 రూపములో తెలియజేసింది.
*Candidates may note that the TET Results will be Announced after clarification from Election Commission*

*ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత టెట్ ఫలితాలు ప్రకటిస్తారని అభ్యర్థులు గమనించవలెను*
*నగరపాలక సంస్థ - గుంటూరు - వార్డు సచివాలయం - 21021182 - 21021183 201021205 నందు వార్డు వాలంటీర్లుగా విదులు నిర్వర్తించుచున్నటువంటి కొంతమంది వార్డు: వాలెంటీర్లు విధుల నుండి తొలగించడమైనదని ఉత్తర్వులు జారీచేయుట-గురించి.*
💥 *వైజాగ్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 25వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్న అధికారులు. బ్రెజిల్ నుండి వచ్చినట్లు నిర్ధారణ. ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ స్పెషల్ ఆపరేషన్*
☛ ఈ నెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్న పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న *11 మంది వాలంటీర్లను* విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు.

☛ ఎస్.కోట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలుగుబిల్లి గ్రామ సచివాలయం పరిధిలోని *గ్రామ వలంటీర్లు బత్తుల కృష్ణ, బోనెల మనోజ్ కుమార్లను* విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు.

☛ రాజమండ్రి నగరపాలక సంస్థ 44వ వార్డు పరిధిలో సచివాలయం 76, 77లకు చెందిన *23 మంది వాలంటీర్లు సస్పెన్షన్.*

☛ ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న *9 మంది వాలంటీర్స్* ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి తొమ్మిది మందిని విధులు నుండి తొలగించినట్లు తెలిపారు.