VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*♻️తల్లికి వందనం పథకం అప్డేట్*

🔰తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ Raise చేసి Remarks లో *Eligible and to be paid* అని ఉన్న వారికి అమౌంట్స్ నిన్న క్రెడిట్ అయినవి.

🔰NPCI Inactive గా ఉండడం వలన Payments fail అయిన వారికి Payments process చేయబడినవి.వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి.

✴️పై వాటికి సంబంధించిన *Payment Status* లు *NBM పోర్టల్ లో* సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి.

గమనించగలరు.
*వితంతు పెన్షన్ [ స్పాజ్ ] అప్డేట్ :*

1. పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య వివరాలు నమోదు చేసే సమయంలో భర్త మరణించిన తేదీ తప్పుగా నమోదైన ఉన్నవారు గమనించగలరు.

2. తప్పుగా నమోదైన వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA/WWDS అధికారుల S S Pension వెబ్సైట్ నందు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరణించిన తేదీ మరియు మరణించిన డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
*🟡డిపార్ట్మెంట్ పరీక్షల సమాచారం*

🌸జూలై 27 నుండి ఆగస్టు 01 వరకు జరగనున్న డిపార్ట్మెంట్ పరీక్షల హాల్ టికెట్లు జూలై 22వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*P4 లిస్ట్ లొ పెన్షనర్ల పై క్లారిటీ :*

➥ ఇటీవల జరిగిన శిక్షణా సమావేశాల్లో వచ్చిన సందేహాల ఆధారంగా, కేవలం పింఛను (వృద్ధాప్య పింఛను, విధవ పింఛను మొదలైనవి) మాత్రమే పొందుతూ ఇతర ఏవైనా నియమిత ఆదాయ వనరులు లేని వ్యక్తులను P4 గ్రామ సభ ధృవీకరణలో ఆదాయవేతన సభ్యులుగా పరిగణించవద్దని నిర్ణయించబడింది.

➥ అన్ని CPOs ఈ సమాచారం‌ను సంబంధిత పర్యవేక్షకులు మరియు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి, గ్రామ సభలు ఈ మార్గదర్శకాలు పాటిస్తూ నిర్వహించబడేలా చూడాలని కోరుకుంటున్నాం.

➥ పింఛను తీసుకుంటూ మరి ఇతర అనార్హతలు లేనటువంటి కుటుంబాలు కూడా బంగారు కుటుంబాలుగా పరిగణించడం జరుగుతుంది
💰 *ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్ :*

1. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

2. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కార్మికుల ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాల్సి ఉంటుంది.

3. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

4. అంతేకాకుండా మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి.

5. అన్నీ గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది.
*రైతులకు ఈ నెల 23వరకు అవకాశం*

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేని అర్హులు.. ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
*ఏపీలో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు*

*ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని* -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ* మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. జులై 20న అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,*-ప్రకాశం* శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
*త్వరలో స్కూళ్లలో ఆధార్ అప్డేషన్: UIDAI*

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను స్కూళ్లలో అప్డేడేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ తెలిపారు. 45-60 రోజుల్లో ఈ టెక్నాలజీ రెడీ అవుతుందన్నారు. *'ఐదేళ్ల వయసు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ కాని పిల్లల సంఖ్య 7Cr+ ఉంది. 15+ ఏళ్ల వారి కోసం కాలేజీల్లోనూ ఈ సిస్టమ్ తీసుకొస్తాం'* అని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ అప్డేడేట్ కాకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన పథకం కింద కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. UG, PG, మెడికల్, ఇంజినీర్ కోర్సులు చదివే 18-25 ఏళ్లలోపు వారు అర్హులు. 10+2 లేదా ఇంటర్లో 80% మార్కులు, కుటుంబ ఆదాయం ₹4.5లక్షలలోపు ఉండాలి. UG వారికి ఏడాదికి ₹12,000, PG, ప్రొఫెషనల్ కోర్సుల వారికి ₹20,000 ఇస్తారు. OCT 31 చివరి తేదీ. వివరాలకు https://scholarships.gov.in ను చూడండి
*Dear Sir/Madam,*

*✅If Date of Death showing wrongly in wife details captured data ,update Date of death and upload death certificate in WEA/WWDS login* #NTRBharosaPension
Dear All,

🟡Below mentioned screens are Enabled in NTR Portal Live.

➡️Additional Users Screen Online/Offline in MPDO/MC

➡️Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS

➡️Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.
అందరు DA/WEDPS లకు విజ్ఞప్తి,

పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు సచివాలయములకు ఇచ్చిన Mantra L1 FPS పరికరములను సచివాలయ DA/WEDPS లు ఇన్వెంటరీ పోర్టల్ లో acknowledge చేయలేదు.

DA/WEDPS ల Inventory Portal Login Credentials User Name = Secretariat Code-da ,Password = Welcome@123! ఈరోజు 04:00 PM లోగా acknowledge చేయవలెను అని కోరడమైనది.

https://gswshms.ap.gov.in/.
*‼️NTR BHAROSA PENSION MAPPING UPDATE*

*✅STEP::1*

కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన ఎంప్లాయిస్ వారి యొక్క OLD SACHIVALAYAM నందు పెన్షన్ మ్యాపింగ్ &క్లస్టర్ మ్యాపింగ్ WEA/WWDS లాగిన్ నందు వారికి ZERO MAPPING (ఏటువంటి పెన్షన్లు కూడా మ్యాపింగ్ చేయకుండా ఉంచాలి)గా ఉంచాలి.

*✅STEP::2*

MPDO/MC SSP Pension లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వారివి ADD SCREEN నందు యూజర్ డీటెయిల్స్ ADD చేయవలెను

*✅STEP::3*

MPDO/MC లాగిన్ నందు యాడ్ చేసిన తరువాత WEA/WWDS లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వారి పేర్లు డిస్ప్లే అవడం జరుగుతుంది మీరు మ్యాపింగ్ కంప్లీట్ చేయవలెను ..
✅ *ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ కు సంబంధించి ముఖ్య గమనిక..*

1️⃣. బదిలీ అయిన ఉద్యోగులు బదిలీ కాబడిన సచివాలయంలో క్లస్టర్లకు మ్యాపింగ్ తప్పనిసరిగా అవ్వాల్సి ఉంటుంది లేనిచో పాత సిబ్బంది పేర్లతో ఆయా సచివాలయాలలో క్లస్టర్లకు ట్యాగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలా అయితే పెన్షన్ పంపిణీకు పాత సిబ్బంది పేర్లు మాత్రమే చూపిస్తాయి.

2️⃣. సచివాలయ పరిధిలో WEA/WDS వారి S S Pensions వెబ్సైట్ లాగిన్ నందు సచివాలయ పరిధిలో క్లస్టర్ కు సచివాలయ ఉద్యోగులకు మ్యాప్ చేసే ఆప్షన్ ఓపెన్ అయింది.

3️⃣. పెన్షనర్ కు మరియు సచివాలయ సిబ్బందికు మ్యాపింగ్ చేయుటకు కూడా ఆప్షన్ WEA/WDE అధికారుల లాగిన్ లో ఓపెన్ అయినది.

4️⃣. నెట్వర్క్ ఉన్న సచివాలయాలలో మరియు నెట్వర్క్ లేని సచివాలయాలలో పెన్షన్ పంపిణీకు అదనపు సిబ్బందిని జోడించే ఆప్షన్ కూడా సంబంధిత మండల మున్సిపాలిటీ అధికారులైన MPDO / MC వారి లాగిన్ లో ఇవ్వడం జరిగింది.

5️⃣. ఆయా సచివాలయ DDO వారు, WEA / WWDS అధికారులు, కొత్తగా బదిలీ అయిన సిబ్బంది ఈ విషయాన్ని గమనించి పెన్షన్ పంపిణీలో ఎటువంటి మ్యాపింగ్ సమస్య లేకుండా విజయవంతంగా అయ్యేవిధంగా చూడగలరు.
🟡 *Transfer IN & OUT Issue :*

1. ఉద్యోగులు బదిలీలలో భాగంగా బదిలీ అయిన సచివాలయంలో Transfer Ouy / In చేస్తున్న సమయంలో బయోమెట్రిక్ డివైస్ తో సమస్య వస్తుంది.

2. ప్రస్తుతం అందరి వద్ద L1 Mantra డివైసులు మాత్రమే అందుబాటులో ఉన్నందున నేరుగా Mantra అని సెలెక్ట్ చేస్తుంటే బయోమెట్రిక్ తీసుకోవడం లేదు అని ఫీల్డ్ లో చాలామంది సమస్యలను తెలియజేస్తున్నారు.

3. అప్పుడు Startek అని సెలెక్ట్ చేసి Mantra తో DDO వారి బయోమెట్రిక్ వేస్తే అవుతుంది. టైం జోన్ ఆటోమెటిక్ లో ఉండేలా చూసుకోండి.
🟨 *నిధి పోర్టల్ లో Transfer In మరియు Transfer Out మార్గదర్శకాలు*


🔁 Transfer Out:

మీరు బదిలీ అయిన తేదీ (రిలీవ్ అయిన రోజు) నిధి పోర్టల్‌లో Old DDO లాగిన్ ద్వారా "Transfer Out" చేయాలి.


🔁 Transfer In:

**జాయిన్ అయ్యే తేదీ** ను "Date of Joining"గా పేర్కొంటూ కొత్త DDO లాగిన్ ద్వారా "Transfer In" చేయాలి.


⚠️ ముఖ్యమైన నిబంధన:

1. ఒకే రోజున Transfer Out మరియు Transfer In చేయడానికి అనుమతి లేదు.

2. ఉదయం రిలీవ్ అయ్యి అదే రోజున కొత్త స్థలంలో జాయిన్ అయినా కూడా, Transfer Out = రిలీవ్ అయిన ముందు రోజు డేట్, Transfer In = జాయిన్ అయిన తేదీ రోజుగా నమోదు చేయాలి.

3. ఒక రోజు ఉదయం రిలీవ్ అయితే ఇంక ఆరోజు ఆ స్టేషన్ లో పనిచేయనట్టు వస్తుంది, అందుకే జాయినింగ్ స్టేషన్ లో కూడా అదే రోజు ఉదయం మాత్రమే జాయిన్ చేసుకుంటారు.

4. సాయంత్రం రిలీవ్ అయితే అదే రోజు సాయంత్రం లేదా తర్వాత రోజు ఉదయం కొత్త స్టేషన్ లో జాయిన్ అవ్వచ్చు.


📄 Non Drawal Certificate:

రిలీవ్ అయిన తేదీ వరకు పాత DDO వద్ద నుండి Non Drawal Certificate తీసుకోవాలి.
Link : https://t.me/VolunteerConnection/17304?single
మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ NON-PH (నాన్-ప్రొఫెషనల్) వర్కర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. *కేటగిరీ-1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500, కేటగిరీ -2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ-3 వర్కర్లకు రూ.15,000 నుంచి రూ.18,500కు పెంచింది.* కాగా తమకు వేతనాలు పెంచాలని వీరు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
Dear All
GSWS staff Rationalization and transfers have completed and lot of changes happened in staff.
Pensioners and GSWS staff mapping screens are enabled in pension portal.
Please inform all Village/Ward Secretariats to complete the mapping.
*SALARY BILL UPDATE INFO*

*జూలై నెల శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు ముందుగా సబ్మిట్ చేయవలసిన ఈ ఆఫీస్ టైల్ తొలగించడం జరిగింది. కావున ప్రస్తుతం బిల్లు సబ్మిట్ చేయడానికి అవుతుంది. జూలై నెల శాలరీ బిల్ సబ్మిట్ చేసుకోవచ్చు*
✅ *జీవో నం. 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాల ముఖ్యమైన పాయింట్లు:*

1. ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు.
2. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా *3 సెంట్ల* భూమి ఇవ్వబడుతుంది.
3. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా *2 సెంట్ల* భూమి కేటాయిస్తారు.
4. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
5. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి.
6. కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం లేకపోవాలి.
7. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారు.
8. ఇప్పటికే భూమి ఉన్నవారికి కేటాయింపు ఉండదు (గ్రామీణ - 5 సెంట్లు, పట్టణం - 2.5 సెంట్లు).
9. చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
10. ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కారు.
11. మైనర్ వయస్సులో ఉన్న వారికి స్థలం ఇవ్వబడదు.
12. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది.
13. స్థలం లేని చోట APTIDCO లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు.
14. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు.
15. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది.
16. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
17. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి.
18. ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడం నిషేధం.
19. స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలి.
20. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.
21. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి.
22. గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి.
23. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి.
24. అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి.
25. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు.
26. కుటుంబ ఆదాయం ₹10,000 (గ్రామీణ), ₹12,000 (పట్టణ) లోపల ఉండాలి.
27. అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయింపు ఉంటుంది.
28. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది.
29. ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు.
30. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.