VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *ప్రతి సంవత్సరం ఈ–KYC తప్పనిసరి!*

🏠 కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ–KYC చేయించుకోవాలి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.

📱 ఈ–KYC చేయడానికి మార్గాలు:
1️⃣ ఇండియన్ ఆయిల్ / హెచ్‌పీ / భారత్ పెట్రోలియం యాప్ ద్వారా
2️⃣ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో
3️⃣ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా

💰 సేవ ఉచితం | బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి

📅 ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేయాలి.

🛢️ సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకే సబ్సిడీ, అందులో 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ KYC పూర్తి అయ్యే వరకు నిలిపి వేయబడుతుంది.

⚠️ మార్చి 31లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ రద్దవుతుంది.
సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు.
💰 *పెన్షన్ అప్‌డేట్*

ఈ నెలలో కూడా అపీల్ చేయని (Not Appealed) పెన్షన్ దారులకు నగదు విడుదల అయ్యింది.
✅ ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
⚙️ మరణం కేసులు తప్ప సంఖ్యలో మార్పు లేదు.

📢 ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.
*ఆంధ్రప్రదేశ్ లో బిక్షము ఎత్తుకునే వారు ఇక నుండి యచన చేయకుండా ఉండేదుకు జీ.ఓ నంబర్: 58 ను జారీ చేసిన ప్రభుత్వం.*
*🟣NTR భరోసా పెన్షన్ పథకం*

☀️తేదీ:31.10.2025 న పెన్షన్ అమౌంట్ డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందించవలెను.

☀️అమౌంట్ డ్రా చేసిన వెంటనే *NTR భరోసా పెన్షన్ యాప్* నందు *Cash withdrawn status* ను అప్డేట్ చేయవలెను.

☀️నవంబర్ ఒకటో తేదీన ఉదయం 6.30 గంటల నుండి పింఛను పంపిణీ చేయవలెను.

☀️ *నవంబర్ 02వ తేదీ ఆదివారం* కావున మిగిలిన పెన్షన్లు నవంబర్ మూడో తేదీ పంపిణీ చేయవలసి ఉంటుంది.

☀️నవంబర్ *మూడో తేదీన* పెన్షన్ పంపిణీ ముగుస్తుంది.
✅ *ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు*

☛ ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

☛ హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ (NMMS) మరియు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ (Face RD App) లను ఉపయోగిస్తారు.

☛ కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.

☛ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.

☛ ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

☛ నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
🚨 *ఆధార్ అప్‌డేట్: నవంబర్ 1 నుండి కొత్త నియమాలు*

☛ ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్: పేరు (Name), చిరునామా (Address), పుట్టిన తేదీ (DOB), మొబైల్‌ నంబరు (Mobile Number) వంటి వివరాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

☛ బయోమెట్రిక్ తప్పనిసరి: వేలిముద్రలు (Fingerprints), ఐరిస్‌ స్కాన్ (Iris Scan), ఫొటో (Photo) వంటి బయోమెట్రిక్‌ వివరాల నవీకరణ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్‌ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.

☛ గుర్తింపు పత్రాలు: ఆధార్ అప్‌డేట్ కోసం పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లాంటి ప్రభుత్వ అధికారిక పత్రాలను ఉపయోగించవచ్చు.

💰 *నూతన అప్‌డేట్ ఛార్జీలు (New Charges)*

☛ వివరాల అప్‌డేట్‌ ఛార్జీ: పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ₹75 చెల్లించాలి.

☛ బయోమెట్రిక్ అప్‌డేట్ ఛార్జీ: వేలిముద్రలు, ఐరిస్‌, ఫొటో వంటి బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ₹125 చెల్లించాలి.

☛ పిల్లలకు ఉచితం: 5-7 సంవత్సరాలు మరియు 15-17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌ ఉచితం (Free).

☛ *రీప్రింట్ ఛార్జీ:* ఆధార్ పునర్‌ ముద్రణ (Reprint Request) కోసం
₹40 చెల్లించాలి.

📅 *ముఖ్య గడువులు (Deadlines)*

☛ ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ గడువు: ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకునే అవకాశం 2026 జూన్ 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో ₹75 చెల్లించాలి.

☛ పాన్-ఆధార్ లింకింగ్: పాన్‌కార్డును ఆధార్\u200cతో లింకు చేయడానికి చివరి గడువు డిసెంబరు 31. ఈ తేదీలోపు లింకు చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్‌కార్డు చెల్లదు.

☛ *KYC విధానం:* కేవైసీ (KYC) కోసం ఆధార్‌ నంబరు, ఓటీపీ (OTP) తో పాటు వీడియో కన్ఫర్మేషన్ మరియు ఫేస్‌ టు ఫేస్‌ వెరిఫికేషన్‌ పద్ధతులను కూడా ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
SERP – NTR Bharosa Pension Scheme – Payment of pension to not filed appeal pensioners – Instructions – Issued - Reg.
Dear All,
Revised epay order updated in Pension App..!!
Check once.
ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పునరుద్ధరించిన ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రభుత్వంతో చర్చలు సఫలం. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ.
📢 *ఆధార్ అప్డేట్ అలర్ట్*

నవంబర్ 1 నుండి మొబైల్‌లోనే ఆధార్ కార్డు వివరాలు మార్చుకోవచ్చని వస్తున్న సమాచారం తప్పు. ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్‌లో అలాంటి ఆప్షన్ అందుబాటులో లేదు.

🚫 ఎవరైనా “మేము చేస్తాం” అని చెప్పి డబ్బులు అడిగినా లేదా OTP అడిగినా ఇవ్వకండి.

💬 మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆధార్ వివరాలు మార్చుకునే అధికారిక ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపబడుతుంది.

⚠️ అందరూ జాగ్రత్తగా ఉండి ఈ సమాచారాన్ని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.
📅 *నవంబర్ 2025 సెలవుల జాబితా*

🛑 సాధారణ సెలవులు (Regular Holidays):
2️⃣ - 02.11.2025 (ఆదివారం)
8️⃣ - 08.11.2025 (రెండో శనివారం)
9️⃣ - 09.11.2025 (ఆదివారం)
1️⃣6️⃣ - 16.11.2025 (ఆదివారం)
2️⃣3️⃣ - 23.11.2025 (ఆదివారం)
3️⃣0️⃣ - 30.11.2025 (ఆదివారం)

🌙 ఐచ్ఛిక సెలవులు (Optional Holidays):
🪔 05.11.2025 – కార్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి
🕌 06.11.2025 – హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పూర్ మెహ్దీ జయంతి
Dear All.
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
🌾 *ఏపీ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ కీలక నిర్ణయాలు (నవంబర్ 2025)*

☛ ధాన్యం కొనుగోలు ప్రారంభం: సోమవారం (నవంబర్ 3, 2025) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

☛ కొనుగోలు లక్ష్యం: 2025-2026 ఖరీఫ్‌లో మొత్తం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

☛ రైతు సేవా కేంద్రాలు: ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

☛ కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

☛ చెల్లింపు సమయం: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత, కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమచేసేందుకు చర్యలు చేపట్టారు.

☛ రిజిస్ట్రేషన్ వాట్సాప్ నంబర్: రైతులు తమ ధాన్యం వివరాలను నమోదు చేసుకోవడానికి 7337359375 అనే వాట్సాప్‌ నంబర్‌ని ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
💰 *పెన్షన్ తాజా అప్‌డేట్ – నేటితో ముగింపు*

నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజుతో (నవంబర్ 3) ముగుస్తుంది. ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారు, ఈరోజే మీ సచివాలయంలో ఏ ఉద్యోగి వద్దనైనా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.

👩‍🦳 *భర్త మరణించిన పింఛన్ కేసులు:*

గత నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు, దరఖాస్తుతో మీ గ్రామ / వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి సమర్పించండి. మీ పేరుతో Spouse Pension (వితంతు పెన్షన్) ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరు అవుతుంది.
💼 *త్వరలో ఇంటర్వ్యూ లు - ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ — కౌశలం తాజా అప్‌డేట్*

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు పంపిణీ చేసింది.

📢 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలర్ట్‌గా ఉండండి. ఇప్పటివరకు 17 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారికి నవంబర్ 5 వరకు అవకాశం ఉంది.
⏳ *కౌశలం రిజిస్ట్రేషన్ చివరి తేదీ నవంబర్ 5* ⏳

💼 AP Work From Home (కౌశలం) Jobs
🎓 చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత
👩‍💻 ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా అవకాశం

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి

👉 వెంటనే Apply చేసుకోండి 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
GSWS Inventory Tracking Portal

https://gswshms.ap.gov.in/
GSWS Employee Mobile App 9.13 Updated to Version
03.11.2025

Improved performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor