VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *ఓటర్ జాబితాలో పేరు తొలగించారా? ఫారం-6 లేకుండా ఓటు పొందేందుకు ఈసీ సరికొత్త అవకాశం!*

ముసాయిదా ఓటర్ల జాబితాకు ముందు పేర్లు తొలగించబడిన అర్హులైన పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ ఊరట కల్పించింది. నిబంధనలను సడలిస్తూ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

🔹 *కీలక మార్పులు & మార్గదర్శకాలు:*
• గతంలో మాదిరిగా కొత్తగా *ఫారం-6* సమర్పించాల్సిన అవసరం లేదు.
• ఎన్యుమరేషన్ పత్రంతో పాటు ఈసీ నిర్దేశించిన డిక్లరేషన్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుంది.
• ఒకే రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మారిన వారు *ఫారం-8* ఇవ్వాల్సిన పనిలేదు; కొత్త చిరునామాతో ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధ పత్రం సమర్పిస్తే చాలు.
• బీఎల్‌ఓలు (BLO) క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల నుంచి ఈ పత్రాలను సేకరిస్తారు.
• ఈ సడలింపు ఏపీ, తెలంగాణ సహా మొత్తం *7 రాష్ట్రాల్లో* అమల్లోకి వచ్చింది.

📊 *ఆంధ్రప్రదేశ్‌లో తొలగించిన ఓట్ల వివరాలు (ASDD):*
• మొత్తం తొలగించిన ఓట్లు: *44,89,512*
• చిరునామాలో లేనివారు (Absent): *7,77,885*
• వేరే చోటికి వెళ్లినవారు (Shifted): *14,43,886*
• మృతులు (Dead): *15,22,174*
• డూప్లికేట్ ఓట్లు (Duplicate): *7,37,216*
• ఇతర సాంకేతిక కారణాలు: *8,327*

🔎 పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలతో పాటు సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో తొలగింపు కారణాల పీడీఎఫ్ జాబితాలు అందుబాటులో ఉంటాయి.