VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*RBIS Update*

👉 పంపిణీ చేయకుండా మిగిలిన పింఛన్లు అన్నీ RBIS యాప్ నందు Enrollment కొరకు enable అయ్యాయి.

👉 RBI యాప్ నందు Enrollemt ఆప్షన్ కి వెళ్లి Refresh చేస్తే Pensioners లిస్ట్ అప్డేట్ అవుతుంది

👉 వీరిలో NTR భరోసా పెన్షన్ యాప్ ద్వారా బయోమెట్రిక్/ Face ద్వారా చెల్లించుటకు వీలు కాని (*బయోమెట్రిక్ ఫెయిల్యూర్*) అయిన వారికి RBIS యాప్ నందు కొత్తగా Enrollment చేసి,payment చేయవలెను.

👉 బయోమెట్రిక్/ Face ద్వారా చెల్లించుటకు వీలు అయ్యే వారికి పెన్షన్ యాప్ ద్వారానే payments పూర్తి చేసుకోవలెను. #NTRBharosaPension
🟡 *పెన్షన్ యాప్ నందు పంపిణీ చేయకుండా మిగిలిన పెన్షన్లు అన్నీ అందరి సచివాలయ ఉద్యోగుల లాగిన్ నందు ఉన్న పేమెంట్ కొరకు ENABLE అయ్యాయి.* #NTRBharosaPension
సచివాలయ_సెక్రటరీ_హైడ్రామా.jpg
105.9 KB
కడప జిల్లా లో పెన్షన్ సొమ్ము దొంగలించారంటూ ప్రొద్దుటూరులో *సచివాలయ సెక్రటరీ హైడ్రామా*. వ్యసనాలకు లోనై పెన్షన్ సొమ్ము 4 లక్షలు సొంతానికి వాడుకున్న *ఏడవ వార్డు సచివాలయ సెక్రెటరీ మురళీమోహన్*. శనివారం మధ్యాహ్నమే పెన్షన్ సొమ్మును ఇంటికి తీసుకెళ్లిన మురళీమోహన్. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం. సెకరెటరీ సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ. పోలీసులు కేసు నమోదు. విచారణ చేస్తున్న డిఎస్పి మురళీధర్.

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
⭕ *పింఛను నగదుతో పంచాయతీ కార్యదర్శి పరారీ?*

పాలకొల్లు గ్రామీణ, న్యూస్టుడే: పాలకొల్లు మండలం *లంకలకోడేరులో పంచాయతీ రెండో కార్యదర్శిగా బి.రాము* పనిచేస్తున్నారు. ఆదివారం పింఛను సొమ్మును రూ.2,50,500 ఆయన తీసుకున్నారు. సోమవారం ఉదయం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా విధులకు కూడా హాజరు కాలేదు. దీంతో పింఛన్ల పంపిణీ కూడా ఆగిపోయింది. మరో పంచా యతీ కార్యదర్శి రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.
• Source: ఈనాడు 02.07.24
*వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ నెల్లూరు అర్బన్ 42వ వార్డు వాలంటీర్లు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.*
🛑 *All unpaid pensions will be automatically moved for RBIS payment after failure of 3 Finger / Iris and 3 Aadhar Face attempts* #NTRBharosaPension
🔵 *జీతం బిల్లు ఇప్పుడే e -Kuber కి వెళ్ళింది. ఈ రాత్రి కి జమ కావచ్చు*
*రేపు(జూలై 3న) ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టబోతున్న కొందరి వాలంటీర్లకు ముందస్తుగా పోలీస్ వారు పోలీస్ నోటీసు జారీ చేశారు. జాగ్రత్త!!*
G O Rt No 1160 dt 02 07 2024.pdf
408.6 KB
ఏపీలో పలువురు కలెక్టర్లు బదిలీ
🔴 *Salaries Started Crediting in Accounts.*
🔴 *బ్యాచ్ నెంబర్ వారీగా శాలరీ అకౌంట్ నందు శాలరీ జమ అవుతున్నాయి*
🚨 *మహిళా పోలీసులందరూ గమనించండి రేపు అనగా 03-07-2024వ తేదీన వాలంటీర్లు అందరూ చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టినారు ఆ చలో విజయవాడ ప్రోగ్రాంకు ఎటువంటి పర్మిషన్లు లేవు కాబట్టి అందరూ కూడా మీ యొక్క పరిధిలోని గ్రామ వాలంటీర్లు అందరికీ వెళ్ళవద్దని ఒకవేళ వెళితే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకుంటారని ప్రతి ఒక్క వాలంటీర్ కి తెలియపరచవలసిందిగా అధికారులు ఉత్తర్వులు మీకు తెలియపరుస్తున్నాము*
✓ మైలవరం పింఛన్ల పంపిణీలో వీఆర్వో చేతివాటం.
✓ ఏడుగురికి సంబంధించిన రూ.18 వేలు సొంతానికి వాడుకున్నాడు.
✓ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు
🔴 *గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో బాధ్యత!*

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో *గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే* అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.
⭕ *వలంటీర్లను ఏం చేద్దాం!*

వలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పుచేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. *మూడేళ్లకు మించి వలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి మూడేళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది.* ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకొనే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పుచేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

*పరిశీలనలో ఉన్న కొన్ని ప్రతిపాదనలివీ*

వలంటీర్ల పేరు మార్చి *గ్రామ సేవక్‌, వార్డు సేవక్‌గా* మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి. వలంటీర్ల వేతనం రూ.పది వేలకు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉన్నారు. *ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉంది.*
• Source : ఆంధ్రజ్యోతి 03.07.24

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🟡 *Pension Payments Closed.* #NTRBharosaPension
‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️

సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *08 జూలై 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.