VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⛈️ *కోస్తా ఏపీలో వర్షం కొంత విరామం తీసుకుంది. ఈ అర్ధరాత్రి నుండి మోస్తరు నుండి భారీ వర్షం తిరిగి పడనున్నాయి*
⛈️⛈️⛈️ *విజయనగరం మరియు వైజాగ్‌లకు హై అలర్ట్*. సముద్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 🌧️🌊 ‼️‼️
🛑 *గందరగోళ వ్యవస్థ*

✓ వైసీపీ సర్కార్‌ సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఉద్యోగంలో చేరినవారికి సుదీర్ఘకాలం జాబ్‌చార్ట్‌ రూపొందించలేకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో ఆ ఉద్యోగాల్లో చేరిన లక్ష మందికిపైగా అయోమయానికి గురయ్యారు.

✓ వీఆర్వోలు నామమాత్రంగా సచివాలయాలకు వచ్చినా, పౌర సేవలు మాత్రం తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. రెవెన్యూ సమస్యలకు గ్రామ సచివాలయాల్లో ఏ మాత్రం పరిష్కారం లభించడం లేదు.

✓ మహిళా పోలీసు ఏం విధులు నిర్వర్తిస్తున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎప్పటి లాగానే ఏఎన్‌ఎంలు డాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. రికార్డింగ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుకు గ్రూప్‌–1 స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన ప్రభుత్వం వారి సేవల వినియోగంలో విఫలమైందంటున్నారు.

✓ 14 రకాల సచివాలయ ఉద్యోగులుంటే.. అందులో ప్రతి శాఖ ఉద్యోగులకూ ఉద్యోగరీత్యా సమస్యలున్నాయి. కొత్తగా ఏర్పడిన వ్యవస్థకు అన్ని హంగులు సమకూర్చాల్సిన ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఆదిలోనే సమస్యల పుట్టగా సచివాలయ వ్యవస్థ మారింది.

• Source: ABN 19.07.2024
🛑 *సచివాలయాలను ఏంచేద్దాం!*

✓ 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

✓ గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామీణ, పట్టణ స్థానికసంస్థలు, వలంటీర్లు. ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక పటిష్ఠమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని సర్కారు భావిస్తోంది.

✓ సేవల నెపంతో పంచాయతీలు, మున్సిపాలిటీలసార్వభౌమాధికారానికి ఆటంకం కలగకుండా స్థానికసంస్థల ప్రతినిధులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది.

✓ అందుకోసం ఏయే గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు? ఆ జనాభాకు పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సిన సేవలు, అందుకు అవసరమైన సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సిన అవసరముంది.

✓ తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనే యోచనలో కొత్త సర్కార్‌ ఉంది.

• Source: ABN 19.07.2024
VOLUNTEER 🤝 CONNECTION
*‼️Regarding Attendance App* ❌ GSWS Attendance app is not working with jio network. ✔️ Working with Airtel If possible try with other than jio network
• *నిన్నటి లాగే 👆ఈరోజు కూడా Attendance యాప్ జియో నెట్ తో ఓపెన్ కావడం లేదు.*

• *జియో కాకుండా వేరే Mobile Network తో అటెండెన్స్ మార్క్ చేసుకోండి.*
🛑 *పెత్తనం వలంటీర్లదే!*

✓ వైసీపీ కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించి సమాజం మీదకు ఒదిలేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

✓ గ్రామ, వార్డుల్లోని కుటుంబాల గుట్టును రెండున్నర లక్షల మంది వలంటీర్ల చేతిలో పెట్టి ప్రభుత్వం చోద్యం చూసింది. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యవస్థను వైసీపీ కార్యకర్తల కనుసన్నల్లోకి నెట్టేశారు.

✓ లక్ష మంది సచివాలయ ఉద్యోగులను వలంటీర్లకు రిమోట్‌ కంట్రోల్‌గా మార్చేశారు. నగదు పంపిణీ తప్ప ఒక్క సేవ కూడా అందించని ఈ వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

✓ క్లిష్టమైన కరోనా సమయంలో ఇంటింటికీ రేషన్‌ అందిస్తారని ఆర్భాటం చేసిన ప్రభుత్వం చివరకు పేదలను రేషన్‌ షాపుల ముందు క్యూల్లో నిలబెట్టింది.

✓ కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

✓ *కాంట్రాక్టు ఉద్యోగులుగా [ కొంత మంది సిబ్బందిని ] నియమించి* సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించుకోవాల్సిన అవసరముంది.

• Source: ABN 19.07.2024
*‼️Regarding GSWS Facial Attendance*

✅Issue with Jio network is Resolved. You may mark biometric Attendance with jio network now.
🛑 *ఏకరీతిలో అన్న క్యాంటీన్లు*

✓ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని, ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం.

✓ గత ప్రభుత్వం వాటిని తీసేసి కొన్నింటిని వార్డు సచివాలయాలుగా, మరికొన్నింటిని స్టోరేజ్‌ రూములుగా వినియోగించింది. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తిస్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను 10వ తేదీ లోపు పూర్తి చేసేందుకు టెండర్లను ఖరారు చేశాం.

✓ గతంలో అక్షయపాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేది. అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను స్వీకరించాం. వాటిని ఈ నెల 22న తెరుస్తున్నాం.

✓ అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లో ఉంటాయి. రూ.5 కే అల్పాహారం, భోజనం అందిస్తాం మంత్రి నారాయణ వివరించారు.

• Source: ABN 19.07.2024
WEA_WDS_LOGIN_Challan_Mapping_&_Splitting_Request_User_Manual.pdf
2.2 MB
WEA_WDS LOGIN - Challan Mapping & Splitting Request User Manual.pdf
అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంకి ఆనుకుని కొనసాగుతుంది. భుబనేశ్వర్ - శ్రీకాకుళం మధ్య రేపు తీరం దాటే అవకాశం 🌀
request letter.pdf
359.3 KB
*గౌరవ వేతనం బిల్లులు అప్‌లోడ్ చేయని వల్ల కోసం*👆👇

మీ DDOని సంప్రదించి, మాకు ఎలాంటి ఆర్డర్‌లు రాలేదని వారు చెబితే.ఈ లేఖను పూర్తి చేసి, ఆపై దీన్ని మీ MPDO/MCకి సమర్పించండి.

*Note* :-
1.శాంతియుతం గా లేఖ ని సమర్పించవలెను.
2.MPDO/MC ఎటువంటి చర్య తీసుకోకపోతే దయచేసి గౌరవనీయమైన జిల్లా కలెక్టర్‌కి లేఖ ని సమర్పించండి.
🛑 *ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తాం.. ఏపీ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం. -వైఎస్ జగన్*
PR-ONE.pdf
2.3 MB
రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయితీల యందు పారిశుధ్య కార్యక్రమాలను సాంకేతిక పరిజ్ఞానముతో అనుసంధానము చేసి ఆన్ లైన్ ద్వారా పారదర్శకత మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణతో ఈ విధానము (యాప్) ప్రారంభించడం జరిగినది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్ధమైన, సమయపాలన సేవలను అందించడం ద్వారా గ్రామ పంచాయితీలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షించుట ఈ విధానము యొక్క ఉద్దేశ్యం. #PRONE

*APP Link*👇
https://play.google.com/store/apps/details?id=com.pr.one

*SOP Link* 👇
https://t.me/VolunteerConnection/13827
IMG_20240719_190621_270.jpg
209 KB
తహశీల్దార్ల పూర్వ జిల్లాలకు పునః బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వివిధ జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లను తిరిగి వారి జిల్లాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.
⛈️ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు అనకాపల్లి వాయుగుండం ప్రభావం చూపుతోంది. గాలులు కొద్దిగా ఊపందుకున్నాయి మరియు ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. ఈ రాత్రి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాలు. మొత్తం ఎపిసోడ్‌లో మొత్తం 200-300mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 🌧️ 🌊🌀
VOLUNTEER 🤝 CONNECTION
ఛలో విజయవాడ.jpg
🟥 *రేపు(జూలై 20) ఛలో విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయబడిందనే సమాచారం కలదు. విజయవాడ ఎవరు పోవద్దు అని గ్రూప్స్ లో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి*.👆👆
NTR వైద్య సేవా ట్రస్టు.jpg
128.2 KB
YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు పేరును NTR వైద్య సేవా ట్రస్టు గా మార్పు #NTRVaidyaSevaTrust
🌊🌀⛈️ *విజయనగరం, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం(జూలై 20) సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.*