VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉన్న వారు ఒకే గ్రామం లొ ఒక క్లస్టర్ నుండి ఒక క్లస్టర్, ఒకే మండలం లొ ఒక సచివాలయం నుండి ఒక సచివాలయం కు, ఒకే జిల్లాలో ఒక మండలం నుండి ఒక మండలంకు, ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు అడ్రస్ [ HH Mapping Cluster Change ] చేసుకోటానికి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు ఈ అవకాశన్ని ఉపయోగించుకోగలరు.*
నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ లేదని, దీనికి సంబంధించి చట్టం స్పష్టంగా ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద అనుసరించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరని, మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
✅ *బీసీ రుణాల దరఖాస్తు గడువు ఈ నెల 12 వరకు పెంపు*
ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఈ మేరకు దరఖాస్తు గడువు ఈ నెల 12వరకు పెంచామని మంత్రి తెలిపారు. రుణాల సద్వినియోగంపై విజయవాడ బీసీ భవన్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గడువు పెంపు సమాచారాన్ని జిల్లాలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు
✅ *రేపు(11.02.25) మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ*
✅ *సచివాలయంలోనిఒకటో బ్లాక్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఈ సమావేశం జరగనుంది*
*నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్లు సమాచారం.
▪️ *ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.*

▪️ *గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్.*
PM సూర్యఘర్ పథకం కింద 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు.
‼️ *రేషన్ కార్డులు ఇక WhatsApp లొ..*

ఏపీ రాష్ట్రంలో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్లో అందిస్తామన్నారు. అయితే 35 శాతం సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ఆయా శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వాట్సాప్లోనే క్యూఆర్ కోడ్తో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు.
*బర్డ్ ఫ్లూ: చికెన్ తింటున్నారా?*

AP: గోదావరి జిల్లాల్లోని కానూరు, వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు. దీంతో మిగతా ప్రాంతాలవారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని, సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.*
*☪️ 🕋 రంజాన్ సందర్భంగా* సోదర ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగులు *02.03.2025 నుండి 30.03.2025 వరకు సాయత్రం ఒక గంట ముందు ఆఫీస్ / పాఠశాల వదిలి వెళ్ళుటకు అనుమతి* ఉత్తర్వులు విడుదల..
*నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు.*

*గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది.*

*నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.*
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-2, కారుణ్య నియామ కాల కింద నియమితులైన ఉద్యోగులు, తదితరులకు నిర్వహించనున్న కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష కోసం ఈ నెల 24 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీక రిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
Dear all

💥💥All GSWS old portals and apps will not be available from 1:30 PM to 2:00 PM today due to urgent maintenance.

Thank you
TC Note : Director, GSWS will hold Teleconference with all the panchayat Secretaries / Ward Admin secretaries @ 6:30PM today on Reverification of Death Cases ( Geo Coordinates HHs). Please inform PS/WS to join without fail.
‼️ *50% సబ్సిడీ తో రూ.1 కన్నా తక్కువ వడ్డీతో 5 లక్షల లోన్ గడువు పెంపు..*

☛ ఫిబ్రవరి 15కు పెంచిన బీసీ / ఈబీసీ కార్పొరేషన్ ల లోన్ గడువు.

☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / ఈబీసీ కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు చివరి తేదీ పెంపు.

☛ ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశ

☛ 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి ఆ తేదీ నుండి ఓపెన్.
నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #DDO బయోమెట్రిక్‌ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విజయనగరం: మోకాళ్ళపై నిల్చుని వాలంటీర్ల నిరసన

గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని పది వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు విజయనగరం దాసన్నపేట రైతు బజారు జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మోకాళ్ళపై నిల్చుని నిరసన తెలిపారు.