VOLUNTEER 🤝 CONNECTION
36.1K subscribers
3.5K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు 2026 – సర్పంచ్, MPTC, ZPTC, మేయర్, కార్పొరేటర్ పూర్తి వివరాలు
Paddy farmers who are about to harvest paddy crops in coastal Andhra pradesh. Do it immediately before Nov 18th ✅

కోస్తాంధ్రా ‌లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాను . ✅
🗳️ పోలింగ్ అనంతరం కవర్ల ప్యాకింగ్ చెక్‌లిస్ట్

✅ POLLING PACKING CHECKLIST

🟫 బ్రౌన్ కవర్లు — 5

☐ బ్యాలెట్ అకౌంట్
☐ పేపర్స్ సీల్ అకౌంట్
☐ PO డిక్లరేషన్
☐ PO డైరీ
☐ విజిట్ షీట్

❌ సీల్ వేయకూడదు.

🟩 గ్రీన్ కవర్లు — 7

☐ మార్క్ చేసిన కాపీ
☐ సంతకం చేసిన, ఉపయోగించని బ్యాలెట్ పేపర్లు
☐ ఉపయోగించని బ్యాలెట్ పేపర్లు
☐ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ల జాబితా (ఉంటే)
☐ రద్దు చేసిన బ్యాలెట్ పేపర్ల జాబితా (Nil)
☐ రద్దు చేసిన బ్యాలెట్ పేపర్లు (Nil)
☐ ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్‌ఫాయిల్స్

🔒 సీల్ వేయాలి.

🟨 ఎల్లో కవర్లు — 9

☐ మార్క్ చేసిన కాపీ
☐ పోలింగ్ ఏజెంట్ల నియామక పత్రాలు
☐ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు
☐ ఛాలెంజ్ ఓటర్ల జాబితా (సీల్ వేయాలి)
☐ కంపానియన్ డిక్లరేషన్
☐ ఓటర్ల డిక్లరేషన్ పత్రాలు
☐ రసీదు పుస్తకం మరియు ఛాలెంజ్ ఓట్ల నగదు
☐ ఉపయోగించని / దెబ్బతిన్న పేపర్ సీల్స్
☐ మిగిలిపోయిన ఎన్నికల సామగ్రి

📌 ఛాలెంజ్ ఓటర్ల జాబితా కవర్‌కు మాత్రమే సీల్; మిగిలిన వాటిని అధికారిక సూచనల ప్రకారం గమ్‌తో అంటించాలి.

🟦 బ్లూ కవర్లు — 6

☐ PO హ్యాండ్‌బుక్
☐ ఇంక్ బాటిల్
☐ స్టాంప్ ప్యాడ్
☐ మెటల్ సీల్
☐ Arrow Cross Mark రబ్బర్ స్టాంప్
☐ Distinguishing Mark రబ్బర్ స్టాంప్

⬜ వైట్ కవర్

☐ మిగిలిపోయిన ఎన్నికల సామగ్రిని సూచనల ప్రకారం ఉంచాలి.

━━━━━━━━━━━━━━━━━━

FINAL CHECK BEFORE HANDOVER

☐ అన్ని పత్రాలు సరైన కవర్లలో ఉంచామా?
☐ అవసరమైన చోట మాత్రమే సీల్ వేశామా?
☐ కవర్లపై అవసరమైన వివరాలు నింపామా?
☐ కవర్లు / సామగ్రి అధికారిక చెక్‌లిస్ట్‌తో సరిపోల్చామా?
☐ అన్ని కవర్లను సంబంధిత అధికారికి అప్పగించడానికి సిద్ధం చేశామా?





*⚠️ గమనిక: కవర్ల రంగులు, వాటి సంఖ్య, సీలింగ్ విధానం ఎన్నికల రకం మరియు అధికారిక హ్యాండ్‌బుక్‌ను బట్టి మారవచ్చు. అప్పగించే ముందు అధికారిక చెక్‌లిస్ట్‌తో తప్పనిసరిగా సరిచూసుకోండి.*
*ఏపీ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం*

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియకు తొలి రోజే స్పందన లభించింది. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 11న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, మొదటి రోజే 397 మంది అభ్యర్థులు 487 పేపర్లకు అప్లై చేశారు. నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కన్వీనర్ ఎం. వి. కృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
> రేపటి నుంచి ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 17న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. 18న నామినేషన్ల పరిశీలన. 19న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు. ఈ నెల 20న అప్పీళ్ల పరిష్కారం. 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
🎉📢 మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు గౌరవ వేతనం మంజూరు! 🏆

🏛️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో (13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు) 2026లో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు మరియు సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

📌 Roc.No.3437421/2026/H(Bud), Election Authority & Commissioner and Director of Municipal Administration, తేదీ: 12-11-2026.


💰 కేటగిరీల వారీగా గౌరవ వేతనం వివరాలు:

1️⃣ Returning Officers (RO): రోజుకు ₹1,000 చొప్పున 20 రోజులకు – ₹20,000

2️⃣ Assistant Returning Officers (ARO): రోజుకు ₹800 చొప్పున 20 రోజులకు – ₹16,000

3️⃣ Election Officers (EO): రోజుకు ₹1,000 చొప్పున 15 రోజులకు – ₹15,000

4️⃣ Additional Election Officers: రోజుకు ₹800 చొప్పున 15 రోజులకు – ₹12,000

5️⃣ Assistant Election Officers: రోజుకు ₹800 చొప్పున 15 రోజులకు – ₹12,000

6️⃣ మున్సిపల్ ఉద్యోగులు / ఇతర సిబ్బంది:

🔹 గెజిటెడ్ అధికారులు – రోజుకు ₹1,000 చొప్పున 15 రోజులకు *₹15,000*

🔹 సీనియర్ అసిస్టెంట్ లేదా సమాన కేడర్ వరకు ఉన్న నాన్-గెజిటెడ్ అధికారులు – రోజుకు ₹800 చొప్పున 15 రోజులకు *₹12,000*

🔹 జూనియర్ అసిస్టెంట్లు / వార్డు సెక్రటరీలు లేదా సమాన కేడర్ – రోజుకు ₹600 చొప్పున 15 రోజులకు *₹9000*

🔹 పై కేటగిరీలలోకి రాని ఇతర ఉద్యోగులు / సిబ్బంది – రోజుకు ₹400 చొప్పున 15 రోజులకు *₹6,000*

7️⃣ Master Trainers: హాజరైన వాస్తవ రోజులకు రోజుకు ₹800 చొప్పున చెల్లింపు.

✅ వాస్తవంగా ఎన్నికల విధులకు నియమితులై, విధులు నిర్వహించిన అర్హులైన ఉద్యోగులకు మాత్రమే చెల్లింపులు జరుగుతాయి.

✅ సంబంధిత మున్సిపాలిటీల జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ బాడీ / మున్సిపల్ కౌన్సిల్ / స్పెషల్ ఆఫీసర్ ఆమోదం పొంది, నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలి.

✅ చెల్లింపులకు సంబంధించిన రికార్డులు, వివరాలను ఆడిట్ నిమిత్తం నిర్వహించాలి.
నవంబర్ 14వ తేదీ సాయంత్రం నాటికి రాష్ట్రాల వారీగా అక్వాన్ తుఫాను తాకే అవకాశాలు 🌀 (శాతంలో)

ఆంధ్రప్రదేశ్- 90%
ఒడిశా- 5%
తమిళనాడు - 5%
బంగ్లాదేశ్ - 0%
మయన్మార్ - 0%
పశ్చిమ బెంగాల్ - 0%
🚨 భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై WHO గ్రేడ్-3 ఎమర్జెన్సీ హెచ్చరిక!

భారతదేశంలో రాబోయే రోజుల్లో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తీవ్రమైన వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

📌 ముఖ్య అంశాలు:
• హెచ్చరిక స్థాయి: WHO గ్రేడ్-3 హెల్త్ ఎమర్జెన్సీ అలర్ట్
• ప్రభావ కాలం: 2027 వరకు ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది
• ప్రధాన కారణం: తీవ్రమైన వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య సంక్షోభ ముప్పు
🚨 *తుఫాను హెచ్చరిక*
📢 *AP గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తెలుసుకోండి!*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్!

✅ స్వర్ణ పంచాయతీ (Swarna Panchayat) పోర్టల్‌లో ప్రజలు తమ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

📌 ఎలా తెలుసుకోవాలి?

1️⃣ కింద ఇచ్చిన అధికారిక లింక్‌ను ఓపెన్ చేయండి.

2️⃣ మీ District (జిల్లా) ఎంచుకోండి.

3️⃣ మీ Mandal (మండలం) ఎంచుకోండి.

4️⃣ మీ GP Name (గ్రామ పంచాయతీ పేరు) ఎంచుకోండి.

👉 వెంటనే మీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వివరాలను తెలుసుకోవచ్చు.

🔗 Check Your GP Election Schedule:
https://swarnapanchayat.apcfss.in/knowyourgramanelectionshedule
> ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు. బంగాళాఖాతంలో బలపడ్డ వాయుగుండం. కొన్ని గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం. ఈనెల 17 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే ఛాన్స్‌. విశాఖకు ప్రస్తుతం వెయ్యి కి.మీ. దూరంలో వాయుగుండం. ఈనెల 18 నుంచి ఏపీపై తుఫాన్‌ ప్రభావం. ఈనెల 18,19,20 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు.
ఇంటికే RC, డ్రైవింగ్ లైసెన్స్ లు* *(2024 నుంచీ పెండింగ్ ఉన్నవి)*

ఆంధ్రప్రదేశ్ లో ఆర్సీ(RC), డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి నుంచి 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు ఉన్న 39.60 లక్షల కార్డులను అందజేయనున్నారు. గతంలో ఫీజు చెల్లించిన వారికి పోస్టు ద్వారా ఇంటికే కార్డులు పంపనున్నారు. మిగతా 24.36 లక్షల మంది కూడా రూ. 235 ఫీజు చెల్లిస్తే కార్డులు పంపుతామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
🗳 AP గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 – సర్పంచ్, వార్డు మెంబర్ గుర్తుల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉచిత ఎన్నికల గుర్తుల జాబితాను ప్రకటించింది.

📌 ముఖ్యమైన వివరాలు:

✅ సర్పంచ్ (Sarpanch): 25 ఉచిత గుర్తులు
✅ వార్డు మెంబర్ (Ward Member): 20 ఉచిత గుర్తులు
✅ NOTA: ప్రత్యేక ఎన్నికల గుర్తు

📋 సర్పంచ్ గుర్తులలో:
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు మరియు సాసర్, క్యారెట్ తదితర గుర్తులు ఉన్నాయి.

📋 వార్డు మెంబర్ గుర్తులలో:
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ పొయ్యి, కెమెరా, క్యారమ్ బోర్డు తదితర గుర్తులు ఉన్నాయి.

⚠️ అభ్యర్థులకు ముఖ్యమైన నిబంధన:
అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తును స్వయంగా ఎంచుకోలేరు. Returning Officer ప్రకటించిన జాబితా ప్రకారం వరుస క్రమంలో గుర్తులు కేటాయిస్తారు.

📄 నోటిఫికేషన్ వివరాలు:
🔹 Notification No: 85/SEC-B2/2026
🔹 తేదీ: 26-03-2026
అక్వాన్ తుఫాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సిర్రస్ మేఘాలతో ఆకాశాన్ని మార్చేసింది. ఇది రాబోయే 48 గంటల్లో చాలా తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాలు, విధ్వంసకర గాలులు మరియు తుఫాను ఉప్పెన ముప్పు పొంచి ఉంది ⚠️🌀
> ఏపీకి మరో పెనుముప్పు.. ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం.. ఈనెల 19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. తీరం వెంట 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు.. తుఫాన్‌ను ట్రాక్ చేసేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి పైలట్ బెలూన్.. గాలుల దిశను, వేగాన్ని, మేఘాల ఎత్తును కొలిచే బెలూన్
> కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం. కశ్మీర్ కుల్గామ్ భారీ ఎన్కౌంటర్. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం. భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల ఆపరేషన్. మృతుల్లో లష్కర్ కమాండర్ లతీఫ్ భట్..
🚨 ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్... 🚨

📢 AP స్పెషల్ TET (AP Spl TET) ఫలితాలు విడుదలయ్యాయి!

అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

🔗 ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్:
https://tet2dsc.apcfss.in/

🎉 అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు!
🌾 AP వరి ధాన్యం కొనుగోలు 2026-27: రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన నిబంధనలు | MSP Payment & e-Crop Status
బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం..!
రెండు దిశల్లో తుపాను ముప్పుపై ఉత్కంఠ..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. నవంబర్ 15 ఉదయం 11:30 గంటల IMD పరిశీలన ప్రకారం ఇది విశాఖపట్నానికి సుమారు 960 కిలోమీటర్ల దక్షిణ-ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. అంతకుముందు ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది.

తుపాను తీవ్రత పెరిగే అవకాశం..

IMD అంచనా ప్రకారం నవంబర్ 15 రాత్రికి తీవ్ర వాయుగుండంగా, 16వ తేదీన తుపానుగా, 17వ తేదీన తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. నవంబర్ 18 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారవచ్చని, 19వ తేదీ నాటికి గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అంచనా.