VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం
• మెగా DSC నిర్వహణకు కేబినెట్ ఆమోదం
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ
• పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్కు ఏపీ కేబినెట్ ఆమోదం #APCabinet
మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. #APCabinet
#NTRBharosaPension మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. #APCabinet
🛑 *IMPORTANT: MPDOs and MCs are informed to upload the VWS functionaries salary bills and Volunteers honorarium excluding news paper allowance. The bills already uploaded with allowance will be pushed back from the treasury department.*
🔔 *Paper Bill Note* :

✓ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు 24 జూన్ 24న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు అందరు మున్సిపల్ కమిషనర్లు & PSDDO లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు శాలరీ బిల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ కు సంబంధించిన బిల్లును విడిచిపెట్టి బిల్ పెట్టవలెను.

✓ ఆల్రెడీ సబ్మిట్ చేసినట్లయితే బిల్లును వెనక్కి తెప్పించుకొని న్యూస్ పేపర్ బిల్లు ఎక్సెప్షన్ చేసి అప్పుడు బిల్ ప్రాసెస్ చేయవలెను.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
#APCabinet నిర్ణయాలు
🛑 *పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం*
🚨 *జులై నెల పెన్షన్లు గ్రామా వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం. జులై నెల నుంచి బ్యాంకు ఖాతా లొ నగదు జమ ఉండదు. నేరుగా ఇంటి వద్దనే పంపిణి.* @VolunteerConnection
న్యూస్_పేపర్_అలవెన్స్_రద్దుకు_సంబంధించి_ఉత్తర్వులు_విడుదల.jpg
85.5 KB
*న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల.*
*వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టు విచారణ*

వాలంటీర్ల రాజీనామాల అంశంపై BYC పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 64వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని, వాలంటీర్ల ఫిర్యాదులతో YCP నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని EC, ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది..

√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*వాలంటీర్లపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం*

✓ వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

✓ వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. *'వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం'* అని ఆయన వెల్లడించారు.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✓ *ఈ పెన్షన్లను జూలై 1న సచివాలయం స్టాఫ్ ఇంటింటికి, ప్రతీ ఇంటికి వెళ్ళి ఉదయం 6:00గం. నుండి సాయంత్రం లోపల ఫించన్ దారుల చేతిలో పెట్టాలి.*

✓ *ఫించన్ దారులు సచివాలయం దగ్గరకు రానవసరం లేదు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాజీనామా చేయించబడిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్ధన - శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్లు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
- మేము పలాన పార్టీ వాళ్ళము పలాన పార్టీ వాళ్ళకే పని చెయ్యాలని మేము విధుల్లోకి చేరలేదు.
- మేము అప్లికేషన్లు ఆన్లైన్ లో పెడితే, ఇంటర్వ్యూ కమిషనర్ ఆఫిస్ లోనే జరిగాయి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా అందరికీ చేరవేయాలి అని జాయిన్ అయ్యాము.
- కరోనా మునుపు ప్రజలు మమ్ములను పార్టీ కార్యకర్తలం అని ముద్రించలేదు. కరోనా తరువాత పార్టీ నాయకులే మమ్మల్ని కార్యకర్తలమని ఇలా ముద్రించారు.
- మేము స్వచ్చంధంగా చేరాము కానీ స్వచ్చంధంగా రాజీనామా చెయ్యలేదు.
- సీఎం గారిని, పవన్ గారికి, అందరి అధికారులకు మనవి ఏమంటే దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని కోరుచున్నాము. ≈ *రాజీనామా చేసిన శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్లు*
కమిషనర్ గారి ఆదేశాల మేరకు వార్డు అడ్మిన్ సెక్రెటరీలకు మరియు ఇన్చార్జి సెక్రెటరీ లకు తెలియజేయడము ఏమనగా రేపటి నుంచి మీ సచివాలయంలో వర్కింగ్ లో ఉన్న వాలంటీర్లను పిలిపించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పకుండా వేయించవలెను. జూలై నెల నుంచి తప్పకుండా వార్డు వాలంటీర్ల డ్యూటీ సర్టిఫికెట్ తో పాటు ఆన్లైన్ అటెండెన్స్ సర్టిఫికెట్ కూడా జత చేయవలెను లేనిచో వారికి గౌరవ వేతనం నిలుపుదల చేయబడును. ≈ *శ్రీకాళహస్తి జిల్లా*
🌧️ *ఉత్తరాంధ్రలో వర్షాలు యాక్టివేట్ అయ్యాయి. ప్రస్తుతం పార్వతీపురం & విజయనగరం (వయా అరుకు)వరకు తుపానులు విస్తరిస్తున్నాయి.*
‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* :

▪️ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 వరకు 98,549 మంది రాజీనామా చేసినట్లుగా రిపోర్ట్ రావడం జరిగింది.

▪️ ఈరోజు(జూన్24) తో రాజీనామాల సంఖ్య 1,00,357 కు చేరుకుంది.

🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

👇👇
[ https://shorturl.at/mzQ18 ]

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
• మెగా డీఎస్సీతోపాటు టెట్
• జులై 1న నోటిఫికేషన్ కు కసరత్తు
• నేడు పాత టెట్ ఫలితాల విడుదల

✓ జులై 1న మెగా డీఎస్సీ, టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు.

✓ గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించా ల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

‼️ *ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను నేడే(జూన్ 25) విడుదల*

√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x