VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పార్వతిపురం జిల్లా కేంద్రంలోసోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు వాలంటీర్లు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాజీనామా చేయని వాలంటీర్లు తిరిగి వీధిలోకి తీసుకోవాలన్నారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని ఉన్న తమను ప్రభుత్వం ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు #APVolunteers
కర్నూలు కలెక్టరేట్లో సోమవారం భారత ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. నాయకులు కే. చిన్న ప్రసాద్ మాట్లాడుతూ.. *"కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి పేద ప్రజలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వృద్ధులకు పింఛన్లు మాత్రమే ఇచ్చారు కానీ మహిళ, రైతులకు, విద్యార్థులకు, వాలంటీర్లకు, నిరుద్యోగులకు, ఉచిత ఇసుక విధానం అమలు చేయలేదు"* అన్నారు. తక్షణమే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. #APVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. తుని పట్నంలోని రాజా క్రీడా మైదానంలో సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఐటీయూ నాయకుడు వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ..వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, వాలంటీర్ల జాబ్ చార్ట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. #APVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలంటూ సోమవారం తుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తుని రాజ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతన బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు #APVolunteers
APGLI NOTE.jpg
61.8 KB
🟡 𝗔𝗣𝗚𝗟𝗜 𝗡𝗼𝘁𝗲 :

✓ APGLI నెలవారి ప్రీమియం పెంచుకునే ఆప్షన్ ఇప్పుడు ఉద్యోగుల సెల్ఫ్ లాగిన్ లొ ఇచ్చారు.

✓ నిధి పోర్టల్ లొ లాగిన్ అయ్యాక APGLI సెక్షన్ లొ *"Voluntary Premium Enchance Proposal (ADOV than Slab rates)"* లొ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేశామా DDO వారు ఆమోదించాల్సి ఉంటుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వాలంటీర్లు దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 4 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోనసీమ జిల్లా కన్వీనర్ సతీష్, వాలంటీర్లు పొల్గొన్నారు #APVolunteers
🛑 *వాలంటీర్ల భవిష్యత్తుకు భరోసా?*

• గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థను అలాగే కొనసాగించి వాలంటీర్లను సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

• విద్యార్హతలు ఆధారంగా శాఖల వారీగా సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

• వాలంటీర్లలో ఉన్నత విద్యావంతులు ఉన్న నేపథ్యంలో వారి అర్హతలు ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు,ఉద్యోగ ఉన్నతికి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

• వారందరికి రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యో గ భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

• ఈ నేపథ్యంలో ఈ నెల 10 న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గసమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. #APVolunteers #APCabinet

▪️ Source : ఆంధ్రప్రభ (08.10.24)

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
విజయనగరం మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య వేధిస్తున్నారంటూ సచివాలయ ఉద్యోగులు సోమవారం(అక్టోబర్ 7) రాత్రి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. #GSWSStaff
‼️ *ఇంటర్ విద్యార్థులకు గమనిక* ‼️

➪ ఏపీ లొ మొదటి, రెండో ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి.

➪ 75% కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాలి .

➪ '60-65% ఉంటే రూ.2వేలు, 65-70% ఉంటే 1,500, 70-75% ఉంటే 1,000 రూ. చెల్లించాలి.

➪ 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే.. సైన్సు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులు. ఆర్ట్స్ విద్యార్థుల్ని ప్రైవేట్ క్యాండిడే చర్ కింద పరిగణనలోకి తీసుకుని పరీక్షలకు అనుమతిస్తారు .

➪ ఒకేషన్ విద్యార్థులకూ ఇది వర్తిస్తుంది.
• గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని *ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు* ప్రభుత్వం నిర్వహించనుంది.

• ఇవాళ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

• మొత్తంగా రూ.2,500 కోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో 20 వేల పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయనున్నారు.

• రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. #APPallePandaga
▪️ ఉన్నత అధికారులు ఆదేశాలు మేర SS పెన్షన్ వెబ్సైట్ WEA లాగిన్ నందు Undisbursed Pension అమౌంట్ కి సంబంధించిన Pension challan మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయవలెను.

▪️పెండింగ్ ఉన్న అన్నీ చలానా వివరాలను ఈరోజు(అక్టోబర్ 8) మధ్యాహ్నం 3 గంటలలోపు అప్డేట్ చేయవలెను. #NTRBharosaPension #GSWSStaff