VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
For Central Govt Employees :

APR 1 నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం(UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో 60% ఫ్యామిలీకి పెన్షన్గా ఇస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు. తక్కువ టైం పనిచేస్తే తదనుగుణంగా పెన్షన్ ఇస్తారు.
*ఏప్రిల్లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి*

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు.

జూన్ కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం, అందిస్తామని చెప్పారు.

సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ, అమలు చేస్తామన్నారు.
🌞 *వచ్చేవారం నుంచి జాగ్రత్త.. 38 °Cకు ఉష్ణోగ్రతలు!*

AP రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉంది. మంగళవారం (18th feb) నుంచి గుంటూరు - విజయవాడ, అనకాపల్లి - విజయనగరం, కర్నూలు-కడప బెల్ట్ ఉష్ణోగ్రతలు 38°C వరకు నమోదవుతాయని... ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు, చలి.. మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ప్రజలు తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
*తుది దశకు గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్*

▪️ *రేపే యూనియన్లతో ప్రభుత్వం కీలక భేటీ.*
▪️ *ప్రమోషన్ ఛానెల్ పై స్పష్టత కోరనున్న ఉద్యోగ సంఘాలు
*

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించిన నూటికి నూరు శాతం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలాబాలవీరాంజనేయ స్వామి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధి కారులు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం కావడంతో ఆయా సంఘాల సభ్యుల నుంచి, క్షేత్రస్థాయిలో రేషనలైజేషన్ ప్రక్రియలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది? అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాయి. రేషనలైజేషన్ గురించి ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శుల సేవలు, ఇంజినీరింగ్ శాఖల్లో, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను సాంఘిక సంక్షేమం, వెనుకబడిన, గిరిజన సంక్షేమ శాఖల్లో వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీల యూనియన్ కూడా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా హేతుబద్ధీకరణ కన్నా ముందుగానే జిల్లాల వారీ సీనియారిటీ జాబితాలను రూపొందించి ప్రమోషన్ కల్పించాలని, GSWS లో ఇంతవరకు ప్రమోషన్ కల్పించిన విఎఎ, ఎహెచ్ఎ, విఎస్ఎ, ఎఎన్ఎమ్ లాగా తమకు కూడా సీనియర్ అసిస్టెంట్ పేస్కేలు సమానమైన హోదాలో ప్రమోషన్ ఛానెల్ కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించనున్నట్లు తెలిసింది.
నేడు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ. రేషనలైజేషన్ ప్రక్రియపై చర్చ
*సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ : స్వామి*

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Rationalisation PPT for Employees Meeting 17.02.2025.pdf
776.7 KB
గ్రామా / వార్డు సచివాలయల హేతుబద్దికరణకు సంబంధించి PPT విడుదల. అధికారిక ఉత్తర్వులు విడుదల అవ్వాల్సిఉంది.
ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం!
*27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు*

AP గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న GOVT ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా - గుంటూరు, ఉ. గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
రేపటి కేబినెట్ భేటీ వాయిదా #APCabinet
ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 2025-26 బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. త్వరలో సీఎం చంద్రబాబు బడ్జెట్‌పై కీలక సమావేశం. రూ.3.15 లక్షల కోట్లకు పైగా ఏపీ బడ్జెట్‌ 2025-26 ఉండే అవకాశం.
*↪️ ఆన్లైన్ లో అప్లయ్ చేయు లింక్*

https://apfr.agristack.gov.in/farmer-registry-ap/#/
🔴 *Search Graduate MLC vote polling station no, poling station name & address at*
👇👇👇
https://ceoaperolls.ap.gov.in/SearchYourname_2025/SearchYourname.aspx
ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుట పడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు.
✅ *పీఎం కిసాన్ 19వ విడత నగదు ఫిబ్రవరి 24 న విడుదల అవ్వనున్నాయి.*
Salary Bill Note : సంపాధిత సెలవులు [ Earned Leaves ] 31.12.2024 వ తేదీ వరకు ఎన్ని క్రెడిట్ అయ్యి ఉంటాయో అవి మాత్రమే అప్డేట్ చేయవలెను.
𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬
Added new P4 Survey module

Note :: P4 Survey module will be enabled by 10am.

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor