VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌀 **తూర్పుమధ్య బంగాళాఖాతంలో 'దానా' తుపాన్*

• రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం

• గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి. మీ. వేగంతో కదులుతున్న తుపాన్

• *శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని* తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100 కి. మీ. వేగంతో ఈదురుగాలులు

• మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు: విపత్తుల నిర్వహణ సంస్థ

• ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. #CycloneDana
🌀 *తుఫాను సమాచారం*

➪ తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్.

➪ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా
రూపాంతరం

➪ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం

➪ పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్

➪ దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు

➪ రేపు (తేదీ 24.10.24) రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది .

➪ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

➪ భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.

➪ ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.

➪ వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.

➪ కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

➪ మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.

➪ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. #CycloneDana
ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ 67 కిమీ దూరంలో #CycloneDana 🌀
🌧️ ఈరోజు సాయంత్రం 120-140కిమీ వేగంతో గాలులతో అతి తీవ్రమైన తుఫానుగా మారనుంది.
🌀 తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్ #CycloneDana
🌀 దానా తుఫాను బలహీనపడి ప్రస్తుతం భువనేశ్వర్‌కు సమీపంలో ఉంది. ఇది రేపటి నాటికి అల్పపీడనంగా బలహీనపడుతుంది, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. #CycloneDana