VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *నీటి సంఘాల ఎలక్షన్ - రహస్య ఓటింగ్ విధానం:*

✓ ఈ ఓటింగ్ కేవలం ఏకాభిప్రాయం రానప్పుడు, చేతులు ఎత్తి ఓటు వెయ్యము అన్నప్పుడు నిర్వహిస్తారు. కావలిసినవి ఓటింగ్ బాక్స్, ఓటింగ్ స్లిప్పులు

❀ *ఓటింగ్ స్లిప్పులు తయారీ, పంపిణి & ఓటు వేయుట:*👇🏼

1. పోలింగ్ ఆధికారి ప్రాదేశిక నియోజకవర్గములో ఉన్న వాస్తవమైన ఓటర్లును లెక్కించి వారికీ మాత్రమే ఓటింగ్ స్లిప్పులు సిద్దం చేయాలి.

2. ఓటింగ్ స్లిప్పులు A4 పేపర్ సైజులో 4 వ భాగములో ఉండాలి. అంటే ఒక A4 పేపర్ తో 4 ఓటింగ్ స్లిప్పులు మాత్రమే తయారు చేయాలి.

3. ఓటింగ్ స్లిప్పులో ఒకవైపు: నీటి వినియోగదారుల సంఘం పేరు, ప్రాదేశిక నియోజక వర్గం సంఖ్య, ఓటింగ్ స్లిప్పు యొక్క క్రమ సంఖ్య మరియు పోలింగ్ ఆధికారి యొక్క సంతకం కోసం ఖాళి ఉండాలి.

4. ఓటింగ్ స్లిప్పులో మరొక వైపు: పూర్తీ ఖాళీగా ఉండాలి. ఓటర్లు తమ ఓటింగ్ స్లిప్పులో పూర్తీ ఖాళీగా ఉన్న వైపు *ఫారం-7* లో ఉన్న అభ్యర్ధి యొక్క క్రమసంఖ్యను ఎంపిక చేసుకోవడానికి కేటాయించబడినది.

5. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి ఎంపిక చేసుకోవడానికి, క్రమసంఖ్యను గుర్తుపెట్టుకోవడానికి వరుసల వారిగా కుర్చోబెట్టాలి. మహిళలకు ప్రత్యేకమైన వరుసలలో కూర్చోమని చెప్పాలి.

6. పోలింగ్ సహాయకులు ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు వరుసల వారీగా పంపిణి చేయాలి.

7. ఓటర్లు తమ ఎంపిక ప్రకారం ఓటింగ్ స్లిప్పు యొక్క ఖాళివైపు బాల్ పాయింట్ పెన్ తో అభ్యర్ధి యొక్క క్రమ సంఖ్యను గుర్తుపెట్టాలి. గోప్యత కోసం ఓటింగ్ స్లిప్పును ఒకసారి నిలువుగా ఆతర్వాత అడ్డముగా మడిచి పోలింగ్ ఆధికారి టేబులు మీద ఉన్న ఓటింగ్ బాక్స్ లో వేయాలి.

❀ *ఓటింగ్ స్లిప్పులు లెక్కపెట్టుట:*👇🏼

1. ఓటర్లందరూ తమ ఓటును వేసిన తర్వాత, పోలింగ్ ఆధికారి [ PO ] మరియు పోలింగ్ అసిస్టెంట్ల [ APO ] సహాయంతో అభ్యర్ధుల వారీగా ఓటింగ్ స్లిప్పులు వేరుచేసి, అభ్యర్ధుల వారీగా ఓటింగ్ స్లిప్పులను లెక్కించి, వాటిని రిజిస్టర్ లో మరియు బోర్డు మీద ఏకకాలములో నమోదు చేయాలి.

2. ఓటింగ్ స్లిప్పులను లెక్కింపు పూర్తయిన తర్వాత, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఫలితాలను పోలింగ్ ఆధికారి *"ఫారం-8"* లో ఎన్నికల అధికారికి సమర్పించాలి. #WUA@VolunteerConnection
WUA Elections - model filled forms (1).pdf
2 MB
✅ *నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఫిల్ చేసిన ఫారాలు [ Model ]* #WUA