VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *నేడు ఏపీ క్యాబినెట్ భేటీ*

• సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

• ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

• కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, *వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై* చర్చించే అవకాశముంది.

• 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. #APCabinet #APVolunteers

04:51am - 23.10.2024 - W2N

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
నేడు_మంత్రివర్గ_సమావేశంఅజెండాలో_పలు_కీలక_అంశాలు.jpg
222 KB
✅ *నేడు మంత్రివర్గ సమావేశం అజెండాలో పలు కీలక అంశాలు* #APCabinet
✅ *నేడు(అక్టోబర్ 23) కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సమాచారం కలదు.* #APCabinet #APVolunteers
ధ్రువ పత్రాలు, పౌర సేవలు ఇంటి వద్ద నుంచి వాట్సాప్ ద్వారా పొందేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టూనున్న ఏపీ ప్రభుత్వం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మోటోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.
✅ *ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం* #APCabinet
✅ ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వైకాపా ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.3,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆలయాల్లో పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన, ఉచిత ఇసుక, మద్యం విధానం, టెక్స్టైల్ పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన విలువైన భూములను వెనక్కి తీసుకునే అంశంపైనా చర్చ జరిగే అవకాశముంది. #APCabinet
🌀 **తూర్పుమధ్య బంగాళాఖాతంలో 'దానా' తుపాన్*

• రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం

• గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి. మీ. వేగంతో కదులుతున్న తుపాన్

• *శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని* తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100 కి. మీ. వేగంతో ఈదురుగాలులు

• మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు: విపత్తుల నిర్వహణ సంస్థ

• ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. #CycloneDana
🛑 *ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కేబినెట్‌ భేటీ అనంతరం తాజా రాజకీయాలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం.. ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై సుదీర్ఘ చర్చ.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం.* #APCabinet
🟡 *ఏపీ కేబినెట్ మీటింగ్ - 23.10.2024* #APCabinet
✅ *రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ రోజు జరిగిన భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 04:00 గంటలకు ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు.*

💥 *Live Link*👇

https://www.youtube.com/live/0dOItqVlyvE?si=K8XMmEaLwrAhngT_

✅ ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, *వాలంటీర్ల కొనసాగింపు*, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. #APCabinet #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 *PSDA / WEDPS - Aadhaar Camp Note :*

☛ మీరు ఆదార్ మొబైల్ కాంప్ క్లోజ్ చేసిన తరువాత ఆ సర్వీసెస్ డీటెయిల్స్ ను APSEVA (New) పోర్టల్ _( మీ లాగిన్ లో )_ మాత్రమే తప్పని సరిగా యాడ్ చేయవలెను.

☛ ఆధార్ కిట్ ఈ రోజు డ్రైవ్ క్లోజ్ చేసే ముందు మరల సింకర్నైజేషన్ చేయవలెను.

☛ ఈ రోజు సాయంత్రం సింక్ చేసినపుడు వచ్చిన OTP తో రేపు అనగా 24-October -2024 న జరగబోయే డ్రైవ్ లో లాగిన్ కాగలరు.
💥 *దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు* ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

💥 నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.

💥 ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు.

💥 ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది #FreeGasCylinders
✅ *ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం.*
▪️ ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

▪️ ఈనెల 31న ఈ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు.

▪️ వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు.

▪️ ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్,

▪️ ఆగస్టు - నవంబర్ మధ్య రెండోది,

▪️ డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. #FreeGasCylinders
▪️ 21వ అఖిల భారత పశుగణన
▪️ 25.10.2024 నుండి 28.02.2025 వరకు
▪️ మీ ఇంటికి వచ్చే విషయసేకరణ దారులకు మీ పశువుల సమగ్ర సమాచారం అందించండి. తద్వారా పశుగణ రంగ పథకాల రూపకల్పనకు సహకరించండి.
✅ *రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం లొ పెట్టిన పెన్షన్లు,సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.*
🌀 *తుఫాను సమాచారం*

➪ తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్.

➪ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా
రూపాంతరం

➪ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం

➪ పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్

➪ దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు

➪ రేపు (తేదీ 24.10.24) రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది .

➪ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

➪ భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.

➪ ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.

➪ వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.

➪ కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

➪ మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.

➪ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. #CycloneDana